Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రోబో 2.0'లో 12 విభిన్న వేష‌ధార‌ణ‌ల‌తో క‌నిపించ‌నున్న అక్ష‌య్ కుమార్‌?

  • చ‌ర్చించుకుంటున్న ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు
  • డిసెంబ‌ర్ 12న ట్రైల‌ర్ విడుద‌ల చేసే అవ‌కాశం?
  • మ‌రో పోస్ట‌ర్ విడుద‌ల చేసిన నిర్మాత‌లు
శంక‌ర్ సినిమాల్లో హీరోల గెట‌ప్‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా హీరోల వేష‌ధార‌ణ మార్చ‌డం శంక‌ర్‌కి బాగా అల‌వాటు. ఈ నేప‌థ్యంలో ప్రతిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిన 'రోబో 2.0' చిత్రంలో కూడా విల‌న్‌గా చేసిన అక్ష‌య్ కుమార్, 12 విభిన్న వేష‌ధార‌ణ‌ల్లో క‌నిపించ‌నున్నట్లు ఇండస్ట్రీ వ‌ర్గాలు చర్చించుకుంటున్నాయి. 'డాక్ట‌ర్ రిచ‌ర్డ్స్' అనే పిచ్చి శాస్త్ర‌వేత్త పాత్ర‌లో అక్ష‌య్ కుమార్ క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల సినిమాకు సంబంధించి మ‌రో కొత్త పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేసి సినిమా మీద అంచనాలను మ‌రింత పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు నిర్మాత‌లు.

ఈ పోస్ట‌ర్‌లో నాలుగు చేతివేళ్ల‌ను మాత్ర‌మే చూపించారు. వాటి వెన‌కాల క‌న్నును పోలిన ఆకారాన్ని చూడొచ్చు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్ర ట్రైల‌ర్‌ను ర‌జ‌నీకాంత్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 12న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సమాచారం. తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల‌తో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 15 భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది.
robo
2.0
shankar
rajnikanth
akshay kumar
amy jackson

More Telugu News